Check the voter list – Narayana Reddy,ఓటరు జాబితాను సరి చూసుకొండి-పలమనేరు నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి,నారాయణరెడ్డి

B4U NEWS
WEB LINK :- b4unews.in

1.ఓటరు జాబితాను సరి చూసుకోవాలని పలమనేరు నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి .నారాయణరెడ్డి పేర్కొన్నారు.
2.అందులో భాగంగా గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

3.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో లాగా కాకుండా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
4.1500 ఓట్లు దాటితే రెండో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందన్నారు.
5.ఇప్పటివరకు ఓటరుగా నమోదైన వారు ఆన్లైన్లో వారి ఇంటి నెంబరు, ద్వారా ఎంత మంది ఓటర్లుగా నమోదయ్యారు అనే విషయం తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని వివరించారు.
6.నియోజకవర్గంలో ఇప్పటివరకు 18 సంవత్సరములు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం హాజరైన రాజకీయ పార్టీల నాయకులు , అధికారులు చొరవ చూపాలని కోరారు.
7.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బహుజన సమాజ పార్టీ కో అధికారి శివాడి గోవిందు మాట్లాడుతూ ఓటు హక్కును తెలియకుండా తొలగిస్తున్నారని అలా ఎలా చేస్తారని వాదనకు దిగారు దీనిపై నారాయణరెడ్డి మాట్లాడుతూ అలా జరిగి ఉండదని ఒకవేళ జరిగి ఉంటే ఇకపైన అలా జరగకుండా చూసుకుంటామని తెలియజేశారు
8.ఈ కార్యక్రమంలో బిజెపి, టిడిపి, వై ఎస్ ఆర్ సి పి, సిపిఎం, సిపిఐ, బి ఎస్ పి, పార్టీ నాయకులు, ఐదు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *