Dengue-infected student dies-డెంగ్యూ సోకి విద్యార్థిని మృతి

పలమనేరు రూరల్ – B4U న్యూస్,

డెంగ్యూ వ్యాధి తో పదవ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందిన సంఘటన పలమనేరు రూరల్ మండలంలో గురువారం చోటుచేసుకుంది వివరాల మేరకు ఇలా ఉన్నాయి, కొల మాసనపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యం.మౌనిక 16 కు నేటికి నాలుగు రోజుల క్రితం
జ్వరం వచ్చిందని వారి తల్లిదండ్రులు స్థానికంగా ప్రథమ చికిత్స నిమిత్త పలు వైద్యుల దగ్గర చికిత్స పొందారు, మూడు రోజుఅయినా జ్వరం తగ్గక పోవడంతో సరాసరి కుప్ప మెడికల్ పెద్దఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లినట్లు తెలిపారు అక్కడ రక్త కణాలు క్షీణించడంతో బాలిక మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు, మౌనికమృతదేహాన్ని అక్కడ్నుంచి వాళ్ల తల్లిదండ్రులు స్వగృహం ఎర్రగుంటపల్లి గ్రామం లోకి తీసుకురావడం జరిగింది,మౌనిక చెల్లెలు అంజలి(10)కు కూడా డెంగ్యూ జ్వరంతో కుప్పం మెడికల్ కాలేజ్ లో వైద్యంచెస్తున్నారు.

డెంగ్యూ మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శుభ్రత పాటించాలని ఇండ్ల వద్ద శుభ్రతతో చంటి పిల్లలు చిన్న పిల్లలు విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా శుభ్రతలు గురించి వారి తల్లిదండ్రులు అందించాలని సూచించారు,హైస్కూల్ ఉపాద్యాయులు విద్యార్థులు పలువురు బాలిక మృతికి సంతాపం వ్యక్తం చేశారు

మౌనిక ఫైల్ ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *