Palamaner division leader calls for victory of ninth congress Anganavadi Conferences,తొమ్మిదవ అఖిలభారత అంగనవాడి మహాసభలను జయప్రదం చేయాలని,పలమనేర్ డివిజన్ నాయకురాలు వాణిశ్రీ పిలుపు

పలమనేరు నియోజకవర్గం,పలమనేరు పట్టణం

నవంబర్ 17, 18, 19,20 తేదీలలో విజయనగరం లో సిఐటియు ఆధ్వర్యంలో జరుగు తొమ్మిదవ అఖిలభారత అంగనవాడి మహాసభలను జయప్రదం చేయాలని, ఆ సంఘం పలమనేర్ డివిజన్ నాయకురాలు వాణిశ్రీ పిలుపునిచ్చారు.
2.అందులో భాగంగా గురువారం గుడియాత్తం రోడ్డు నందుగల ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో అందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
3.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రారంభము నుండి గ్రామీణ, పట్ఠణ ప్రాంతాల్లోని పిల్లలకు, బాలింతలు, గర్భవతులకు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని ఎన్నో సేవలు అందించామని, గుర్తు చేశారు.
4.అన్ని సేవలు అందించిన ప్రభుత్వాలు మాత్రం మాపై సవతి తల్లి ప్రేమ చూపించే తప్ప , కనికరం చూపించలేదు అన్నారు.
5.మా డిమాండ్లను పోరాటాల ద్వారా సాధించుకున్నామని చేసిన పోరాటాలను ఇటువంటి మహా సభల ద్వారా చర్చించుకుని భవిష్యత్తు పోరాట ప్రణాళికలను మహాసభల వేదికల ద్వారా సిద్ధం చేసుకుంటామని తెలిపారు.
6.అంగన్వాడీలకు కనీస వేతనం 18 వేల రూపాయలు , ఫీఎఫ్ ఈఎస్ఐ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

  1. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, వనజ, గీత, చిలకమ్మా,, సుబ్బమ్మ,, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *