ఘోర రోడ్డు ప్రమాదం, ఓమ్ని వ్యాన్‌, బైక్ పైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు

చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారి మారిన, రహదారిపై జరిగే ప్రమాదాలు స్థితి మాత్రం మారలేదు.

B4U News,Chittoor:-

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ దగ్గర వాహనాలపై కంటైనర్‌ బోల్తాపడింది. 
బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓమ్ని వ్యాన్‌, బైక్ పైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. 
ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొగిలి ఘాట్లో మృతుల్లో కంటైనర్ డ్రైవర్, క్లీనర్, చిత్తూరు నుండి గంగవరం వెళుతున్న మినీ వ్యాన్ లో ఎనిమిది మంది మృతి రామచంద్ర 50, రాము 38, సావిత్రమ్మ 40, ప్రమీల 37, గురమ్మ 52, సుబ్రమణ్యం 49, శేఖర్ 45, పాపమ్మ 49, వీరందరూ గంగవరం మండలం, మర్రి మాకుల పల్లె గ్రామానికి చెందిన వారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కంటైనర్ కిందపడిన ద్విచక్ర వాహనం దారుడు నరేంద్ర మృతి చెందాడు. ఇతనిది పలమనేరు మండలం బలిజపల్లి గా గుర్తించారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు
సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం, చిత్తూరు నుండి గంగవరం వెళుతున్న మినీ వ్యాన్ లో 11 మంది మరియు బైక్ డ్రైవర్ మృతి

1 thought on “ఘోర రోడ్డు ప్రమాదం, ఓమ్ని వ్యాన్‌, బైక్ పైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు

  1. చాలా పెద్ద ప్రమాదం. ఘోరం
    దేవుడు ఎందుకు ఇలాంటి రాతలు రాస్తాడో…!!!
    RIP TO ALL

    ప్రభుత్వం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి,ప్రమాదం భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని నా మనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *