చిన్నారిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు

B4U NEWS
PALAMANERU.:-

చిన్నారిని హత్య :-

చిత్తూరు జిల్లా తాంబలపల్లి తాలూకా కూరబలకోట మండలం అంగల్లు లోని NNR కల్యాణ మండపం దగ్గర అర్ధ రాత్రి 12:00 గంటలకు పాపా కనబడకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు. పాపా కిడ్నప్ అయినట్టు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఈ రోజు ఉదయం అదే కల్యాణ మండపం వెనుకాల తెల్లవారి 06:00 గంటలకు చిన్నారి వర్శిని మృతదేహమై కనబడింది.

గురువారం NNR కల్యాణ మండపం కు పాపా వారి తల్లిదండ్రులు బంధువుల పెళ్ళికొసం వచ్చారని వారి తల్లిదండ్రులు తెలియచేసారు. అభం శుభం తెలియని తమ పాపను చంపినందుకు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
హత్య సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు. సి.సి ఫోటోజ్ ఆధారంగా నిందితులను గుర్తించడానికి ప్రయత్నం చేతున్నాం అని పోలీసులు, ఉన్నతాధికారులు తెలియచేసారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

చిన్నారి వివరాలు:-
పేరు – వర్శిని
తండ్రి -సిద్దా రెడ్డి(వ్యవసాయం)
తల్లి. -ఉషా రాణి
తరగతి -3వ తరగతి
స్వగ్రామం- గట్టు, బి కొత్త కోట మండలం ,తాంబలపల్లి తాలూకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *