DS4-దళిత్ శోసిత్ సమాజ్ సంఘర్షణ సమితి, SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పై అవగాహన సదస్సు

DS4 జిల్లా కో అధికారి శ్రీ గిరి బాబు గారు L.L.B మాట్లాడుతూ మనం మన హక్కులను ఉపయోగించుకోవడం లేదు అని అస్సలు మనకోసం ఉన్న హక్కులు మనకే తెలియదని వీటిని తెలుసుకోవడం మన బాధ్యత అని, ఆ బాధ్యతలను తెలియచెప్పేందుకే మీ ముందుకు DS4 సంఘాన్ని తీసుకొచ్చామని తెలియచేసారు.

DS4-దళిత్ శోసిత్ సమాజ్ సంఘర్షణ సమితి, SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పై అవగాహన సదస్సు:-

B4U NEWS
Web Link:- www.b4unews.in

పలమనేరు పట్టణంలోని ఇంటర్ ప్రభుత్వ కళాశాల నందు నిర్వహించిన DS4 (దళిత్ శోసిత్ సమాజ్ సంఘర్షణ సమితి) అధర్వంలో SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పై అవగాహన సదస్సు లో చిత్తూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు శ్రీ కత్తి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన అట్టడుగున ఉన్న కులలపైన జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు మన DS4 మొదలయింది అని, ఐకమత్యమే మహా బలం అని మనం అందరం కలిసి ఉంటేనే మన జాతిని అగ్ర జాతిగా నిలబెట్టుకోగలం అని తెలిపారు. B.S.P పార్టీ కో ఆర్డినటర్ శివాడి గోవిందు మాట్లాడుతూ మన కోసం మనం కష్టపడాలి మీ కోసం అంబెడ్కర్ గారు రాసిన రాజ్యాంగ హక్కులను తెలుసుకోండి అని తెలిపారు.

DS4 జిల్లా కో అధికారి శ్రీ గిరి బాబు గారు L.L.B మాట్లాడుతూ మనం మన హక్కులను ఉపయోగించుకోవడం లేదు అని అస్సలు మనకోసం ఉన్న హక్కులు మనకే తెలియదని వీటిని తెలుసుకోవడం మన బాధ్యత అని, ఆ బాధ్యతలను తెలియచెప్పేందుకే మీ ముందుకు DS4 సంఘాన్ని తీసుకొచ్చామని తెలియచేసారు.

SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు శ్రీ సుబ్రమణ్యం గారిని గౌరవ DS4 కార్యకర్తలు గణంగా సన్మానించారు

SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ శ్రీ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ మనం తెలుసుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటే చేయగలం మనపైన మనకు గట్టిగా నమ్మకం ఉండాలని తెలిపారు అలాగే SC & ST ప్రజలు లోన్స్ ఎలా తీసుకోవాలి మరియు అగ్రికల్చర్ పైన లోన్స్ తీసుకొని మనం ఎలా ముందుకు నడవాలో, మనం లోన్స్ తీసుకునేదానికి ఎం కావాలి,ఎలా చేయాలో తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో SC & ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, DS4 చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ కత్తి శ్రీనివాసులు గారు, BSP జిల్లా కో ఆర్డినటర్ శ్రీ శివాడి గోవిందు, పలమనేరు మండల అధ్యక్షులు కె.నాగరాజు, జన వికాస్ సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రమీల, DS4 కార్యకర్తలు రమేష్,పుష్ప, మహేష్,రవితేజ గుండాల మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *