భార్య పై హత్య ప్రయత్నం నెల్లూరు జిల్లా ఆత్మకూరు భార్యపై అనుమానం పెనుభూతమై భార్యను హతమార్చేందుకు ప్రయత్నించాడు ఉన్మాది భర్త….


నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది… గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య రామలక్ష్మమ్మ పై కత్తి తో హత్య ప్రయత్నం చేశాడు తీవ్ర గాయాలతో ఆమె ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది… బాధితురాలు మరియు ఆమె బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. వెంకటరమణ తన భార్య రామలక్ష్మమ్మ పై అనుమానం పెట్టుకొని తరచు వేధించేవాడు. అనుమానపు నిందలతో భార్యను వేధిస్తూ కొట్టేవాడని భర్త వేధింపులు తాళలేక గతంలో రెండు సార్లు రామలక్ష్మమ్మ ఆత్మహత్య ప్రయత్నానికి కూడా పాల్పడినట్టు బంధువులు తెలిపారు.. రాత్రి ఇదే అనుమానం తో నిన్ను చంపుతాను అని బెదిరిస్తూ కత్తి తీసుకుని ఇంట్లో కూర్చుని ఉండడంతో అతని ప్రవర్తన పై భయపడిన భార్య రామలక్ష్మమ్మ తన పిల్లలతో కలిసి ఇంటి పక్కన ఉండే బంధువుల ఇంటికి పోయి నిద్రిస్తుండగా వెంకటరమణ అక్కడికి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా భార్యను గాయపరిచాడు. దీంతో ఐదు చోట్ల కత్తిపోట్ల తో రామలక్ష్మమ్మ రక్తపుమడుగులో పడిపోగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.. ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉంది. భార్యపై హత్యా ప్రయత్నానికి ఒడిగట్టిన భర్త వెంకటరమణ పరారీలో ఉన్నాడు.. మర్రిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *