చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్యాంకర్ కి డీ కొట్టడంతో పది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది…

 

చిత్తూరు జిల్లా, పలమనేరు వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్యాంకర్ డీ కొట్టడంతో పది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. అనంతపురంలోని ఓ ప్రవేటు స్కూల్ కు చెందిన వీరు కొడైకెనాల్ నుండి విహారయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము కావడం దట్టమైన పొగమంచు రొడ్డును కప్పి వేయడంతో బస్సును ఓవర్ ట్యాక్ చేయబోయిన ట్యాంకర్ డీ కొన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై పలమనేరు పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *